తుఫాన్: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
NEWS Oct 25,2025 09:17 pm
తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జి.మాడుగుల తహసిల్దార్ రాజ్ కుమార్ తెలిపారు. ఈనెల 26 నుంచి 3 రోజులపాటు తుఫాను ప్రభావం ఉండబోతుందని తెలిపారు. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలని తెలిపారు. పాడుబడిన భవనాలు, ఇళ్లల్లో ఉండరాదని అన్నారు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని తెలిపారు. గెడ్డలు, వాగులు దాట వద్దని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అన్నారు. తుఫాను ప్రభావంతో అత్యవసర పరిస్థితులు ఏర్పడితే వెంటనే రెవెన్యూ అధికారులకు లేదా దగ్గరలోని సచివాలయ సిబ్బందికి సమాచారం అందజేయాలని తెలిపారు.