ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా చర్యలు
NEWS Oct 25,2025 11:08 pm
ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్ అన్నారు. అక్టోబర్ 26 నుండి 29 తేదీ వరకూ భారీ వర్ష సూచనని వాతావరణ శాఖ ప్రకటించారని కలెక్టర్ పేర్కొన్నారు. 28, 29 తేదీలు చాలా ముఖ్యమని, 28 అర్ధరాత్రి, లేదా 29 తెల్లవారుజామున సమయంలో ఆంధ్రప్రదేశ్ లో మంతా తుఫాన్ తీరం దాటనున్నదని కలెక్టర్ అన్నారు. 4 రోజులు విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉన్నందున ముందస్తు చేపట్టవలసిన చర్యలు దృష్ట్యా అన్ని శాఖలు సమన్వయంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.