ఘనంగా నాగుల చవితి
NEWS Oct 25,2025 04:09 pm
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో నాగుల చవితిని ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పుట్టలు ఉన్నచోట, నాగాలయాల్లో పుట్టలో పాలు పోసి పూజిస్తున్నారు. ఈరోజున కొన్ని నియమాలు పాటిస్తే, శుభం జరుగుతుందని, ముఖ్యంగా పెళ్లిలో ఆటంకాలు ఎదురౌతున్న వారు, కాలసర్పదోషాలతో బాధపడుతున్న వారు, సంతానం లేని వారి సమస్యలు అన్ని దూరమౌతాయని పండితులు చెబుతున్నారు.