టోల్‌గేట్‌ను పంచాయతీకి అప్పగించాలి
NEWS Oct 25,2025 03:19 pm
అనంతగిరి మండల పరిషత్ ఆధ్వర్యంలో బొర్రా గుహల రోడ్డు వద్ద నిర్వహిస్తున్న టోల్‌గేట్‌ను గ్రామ పంచాయతీకి అప్పగించాలని స్థానిక ప్రజాప్రతినిధులు ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అప్పారావు మాట్లాడుతూ, బొర్రా గ్రామ పంచాయతీ అభివృద్ధి నిధులలో 60 శాతం కేటాయిస్తామని గతంలో హామీ ఇచ్చి, ఇప్పుడు మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ నిధులకు కోత విధించడం అన్యాయమన్నారు. అందువల్ల, గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం టోల్‌గేట్‌ను ఇకపై పంచాయతీ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీకి నిధులు సక్రమంగా అందాలంటే ఈ టోల్‌గేట్ నిర్వహణ బాధ్యతలను తమకు అప్పగించాలని ఆయన కోరారు.