ఆనందోత్సాహాల మధ్య నాగదేవత పూజ
NEWS Oct 25,2025 09:47 am
బుచ్చయ్యపేట మండలం, బంగారుమెట్ట గ్రామంలో గ్రామస్తులంతా కలిసి నాగదేవత పూజను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో పిల్లలు, పెద్దలు అందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొన్నారు. గ్రామస్తుల కుటుంబాలన్నీ ఒక్కటై, నాగదేవతకు పసుపు, కుంకుమ, నైవేద్యాలు సమర్పించారు. ప్రత్యేకంగా పాలు, గుడ్లు సమర్పించి భక్తి శ్రద్ధలు చాటుకున్నారు. పూజ అనంతరం గ్రామస్తులు టపాసులు పేల్చి, ఆహ్లాదకరంగా పండుగ వాతావరణాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ సందడి నెలకొంది.