కర్నూలు బస్సు ప్రమాదంలో బైకర్ శివశంకర్ సీసీ టీవీ ప్రకారం ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు అతను ఒక పెట్రోల్ బంక్ కు వెళ్లాడు. శివశంకర్‌తో మరో యువకుడు కూడా ఉన్నాడు. పెట్రోల్ పోయించు కోకుండా.. శివశంకర్ ఒక్కడే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పెట్రోల్ బంక్ నుంచి వెళుతూ బైక్ తో విన్యాసాలు చేశాడు. అప్పటికే మద్యం సేవించి ఉన్న శివశంకర్.. పెట్రోల్ బంక్ నుంచి వెళ్తుండగా.. అక్కడే బైక్ స్కిడ్ అయింది. సీసీటీవీలో రికార్డైన సమయం 24 తేదీ ఉదయం 2.23 గంటలుగా ఉంది. 3 గంటల తర్వాత శివశంకర్ బస్సు ప్రమాదానికి గురై మరణించాడు.