దామచర్ల సత్యకు టీటీడీ ఘన స్వాగతం
NEWS Oct 25,2025 03:12 pm
రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం ఆయన స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు దామచర్ల సత్యకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. అలాగే, 'మాండూస్' తుఫాను దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, వాతావరణ పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు.