ఓలా, ఉబర్‌కు పోటీగా 'భారత్ ట్యాక్సీ'
NEWS Oct 25,2025 11:03 am
ఓలా, ఉబర్‌లకు షాక్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. 'భారత్ ట్యాక్సీ' పేరుతో సహకార పద్ధతిలో ఓ సరికొత్త రైడ్-హెయిలింగ్ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. డ్రైవర్ల నుంచి ఎలాంటి కమీషన్లు వసూలు చేయకుండా, కేవలం సభ్యత్వ రుసుముతోనే ఈ సేవలు అందిస్తారు. ఓలా, ఉబర్ సంస్థలు డ్రైవర్ల నుంచి ప్రతీ రైడ్‌పై 25% వరకు అధిక కమీషన్లు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.