బస్సులో 46లక్షల విలువైన సెల్‌ఫోన్ల దగ్ధం
NEWS Oct 25,2025 05:04 am
కర్నూలు వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదం వెనుక కొత్త వివరాలు వెలుగులోకి వచ్చాయి. బస్సులో ఖరీదైన 234 రియల్‌మీ మొబైల్ ఫోన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. హైదరాబాద్ వ్యాపారి మంగనాథ్, రూ.46 లక్షల విలువైన సెల్‌ఫోన్లను బెంగళూరు ఫ్లిప్‌కార్ట్‌కు పార్సిల్‌గా పంపించారు. ఫోన్ల బ్యాటరీ పేలుళ్ల వల్ల మంటలు మరింతగా వ్యాపించాయని ఫోరెన్సిక్ నిపుణులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు కూడా పేలుళ్ల శబ్దాలు విన్నామని చెప్పారు.