కవిత ‘జాగృతి జనం బాట’ ప్రారంభం
NEWS Oct 25,2025 09:27 am
TG: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ‘జాగృతి జనం బాట’లో ప్రారంభం అయింది. ఉ.9.30 గంటలకు HYD గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడారు. అక్కడ నుంచి మ.ఒంటి గంటకు నిజామాబాద్‌లోని ఇందల్వాయి టోల్ గేట్‌కి చేరుకున్నాక ఆమెకు కార్యకర్తలు స్వాగతం పలుకుతారు. 4 నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా సాగే ఈ యాత్రలో మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులతో ఆమె భేటీ కానున్నారు.