"పినకోట"ను మండలం ఏర్పాటు చేయండి!!
NEWS Oct 25,2025 04:01 am
అనంతగిరి మండలం పరిధిలో గల పినకోటను మండలం ఏర్పాటు చేయాలనీ అక్కడ గిరిజనులు డిమాండ్ చేసారు. నూతన మండలాల అభిప్రాయ సేకరణకు వచ్చిన రెవిన్యూ అధికారులకు శుక్రవారం స్థానిక నాయకులు, ప్రజలు వినతి పత్రం ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధి చెందని ఈ ప్రాంతం మండలం ఏర్పాటు అయితే వందల గిరిజన గ్రామాలు అభివృద్ధి ఫలాలు అందుతాయన్నారు. పూర్తి నివేదికను కలెక్టర్ కు అందిస్తామని వారు అన్నారు,ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జె.అప్పలకొండ, నీడ్స్ సంస్థ ప్రతినిధులు, మురళి, లక్ష్మణ్, వైసీపీ నాయకులు, ప్రేమ్ కుమార్, సత్యనారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు.