మెట్ పల్లి మండలంలో భారీ వర్షం
NEWS Oct 25,2025 09:32 am
మెట్ పల్లి మండలం: జగ్గసాగర్ గ్రామంలో అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకోవడంతో భారీ వర్షం పడింది. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న, వరి పంటను ఇప్పటికే కొనుగోలు కేంద్రానికి ఎండబెట్టడానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం గ్రామాల్లో వరి కోత జోరుగా సాగుతున్నందున వరిని మార్కెట్లకు తరలిస్తున్నారు. వర్షం వల్ల పండించిన పంట దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.