'కాంతార'.. 1000 కోట్ల దిశగా పరుగులు
NEWS Oct 24,2025 03:22 pm
నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన 'కాంతార చాప్టర్ 1' చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అక్టోబర్ 2న కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన 'కాంతార చాప్టర్ 1', ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 818 కోట్లు వసూలు చేసింది. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబడుతూ రూ, 1,000 కోట్ల దిశగా దూసుకెళుతోంది. తెలుగు వెర్షన్ ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనా.