ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
NEWS Oct 24,2025 03:04 pm
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై చర్చిస్తారు. దానికోసం ఈ రోజు రాత్రి దేశ రాజధానికి వెళుతున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు రాష్ట్ర ముఖ్య నాయకులు పాల్గొంటారు. సీఎం రేవంత్ 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.