ప్రజలు కోరుకుంటే కొత్త పార్టీ: కవిత
NEWS Oct 24,2025 01:33 pm
ప్రజలు ఆకాంక్షిస్తే, వారి కోరిక మేరకు తాను తప్పకుండా రాజకీయ పార్టీని స్థాపిస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు తాను చేపట్టనున్న 'జాగృతి జనం బాట' యాత్రకు ముందు ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ నెల 25 నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్రంగా 'జాగృతి జనం బాట' కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ యాత్ర 4 నెలల పాటు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కొనసాగుతుందని వివరించారు.