ఘాట్ రోడ్డుకు నిధులు మంజురు
NEWS Oct 24,2025 01:26 pm
మర్రిపూడి కొండపై కొలువై ఉన్న శ్రీ మృదులగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఘాట్ రోడ్డు నిర్మాణానికి 4 కోట్లు రూపాయల నిధులు మంజూరయ్యాయి. కొండ కింద నుండి దేవస్థానం వరకు 3 కిలోమీటర్ల ఘాట్ రోడ్డును అభివృద్ధి పరిచేందుకు నిధులు మంజూరు కొరకు కృషి చేసిన మంత్రి స్వామికి, మండల టిడిపి నేత రేగుల వీరనారాయణకు భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. కొండపైకి వెళ్లేందుకు రహదారి లేక మెట్ల మార్గంలో నడిచేవారు. దీంతో దశ లవారీగా మట్టిరోడ్డు ఏర్పాటు చేశారు.