భారీగా తగ్గిన వెండి ధరలు
NEWS Oct 24,2025 12:13 pm
వరుసగా 4వ రోజు కూడా వెండి ధరలు భారీగా తగ్గాయి. ఇవాళ కిలో వెండిపై ధర రూ.3 వేలు తగ్గి రూ.1,71,000 వద్ద కొనసాగుతోంది. నాలుగు రోజుల్లోనే సిల్వర్ ధరలు కిలోకి రూ.19 వేలు తగ్గడం గమనార్హం. అటు బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 24K బంగారం 10 గ్రాముల ధర రూ.380 పెరిగి రూ.1,25,460 వద్ద కొనసాగుతోంది. 22K 10 గ్రాముల ధర రూ.350 పెరిగి రూ.1,15,000గా ఉంది.