బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని దిగ్బ్రాంతి
NEWS Oct 24,2025 12:09 pm
కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం చాలా బాధాకరమని ప్రధాని మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. మృతులకు 2 లక్షలు, గాయపడిన వారికి 50వేలు ఎక్స్-గ్రేషియా ప్రకటించారు ప్రధాని. బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 20కి చేరింది. ప్రమాదం నుంచి 23 మంది ప్రయాణికులు బయటపడ్డారు.