కర్నూలు: మొత్తం కుటుంబం సజీవదహనం
NEWS Oct 24,2025 12:01 pm
కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 20 మంది మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో నెల్లూరు జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు ఉండటం అందరినీ కలచివేస్తోంది. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లవారిపాలెంకు చెందిన గోళ్ల రమేష్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు సహా సజీవ దహనమయ్యారు. ఉపాధి నిమిత్తం బెంగళూరులో స్థిరపడిన రమేష్ కుటుంబం, హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం బలి తీసుకుంది. కుటుంబం మొత్తం మృత్యువాత పడటంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.