నేలకొరిగిన భారీ వృక్షం, ట్రాఫిక్ అంతరాయం
NEWS Oct 24,2025 12:10 pm
ప్రకాశం: కొండేపి మండలం పెరిదేపి గ్రామం వద్ద, రాత్రి నుండి ఎడతెరుపు లేని వర్షం. భారీ ఈదురు గాలులకు నేలకు ఒరిగిన భారీ వృక్షం.దీంతో కొండేపి టూ టంగుటూరు వైపు వెళ్తున్న,వాహన దారుల కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.సుమారు రెండు గంటల పాటు రెండు కిలోమీటర్లు మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అప్రమత్తం అయిన అధికారులు, ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.