పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు పిల్లల పాలిట పెను శాపాలుగా మారుతుంటాయి. గుండె గదుల్లో గోడల మధ్య రంధ్రాలు ఉండటం, గుండె నిర్మాణం సరిగా లేకపోవడం, గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాలు తేడాగా ఉండటం.. ఇలాంటి లోపాలు పసిబిడ్డల జీవితాన్ని దుర్భరంగా మార్చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో పిల్లల్లో గుండె జబ్బులు, వాటికి ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్స గురించి డాక్టర్ విలువైన సూచనలు వినండి.