42% రిజర్వేషన్లపై త్వరలో నిర్ణయం
NEWS Oct 23,2025 10:21 pm
TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నెక్ట్స్ మీటింగ్‌లో చర్చిద్దామని సీఎం రేవంత్ చెప్పినట్లు సమాచారం. BCలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది. అయితే నవంబర్ 3న హైకోర్టు తీర్పు ఉండటంతో 7న మళ్లీ భేటీ కావాలని సీఎం నిర్ణయించారు. ఆ రోజు రిజర్వేషన్లు, ఎలక్షన్స్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.