కాంగ్రెస్ అభ్యర్థికి నల్గొండ గద్దర్ ప్రచారం
NEWS Oct 23,2025 10:01 pm
జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని గాయకుడు నల్గొండ గద్దర్ (నర్సిరెడ్డి) కోరారు. నవీన్ యాదవ్‌తో కలిసి పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తూ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం యువకుడు, మంచి మనసున్న నవీన్ యాదవ్ ను గెలిపించాలని స్థానిక ఓటర్లకు పిలుపునిచ్చారు. సీఎం రేవంత్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే నవీన్ గెలిస్తే ప్రతీ స్లమ్ ఏరియా అభివృద్ధి చెందుతుందని, ఎక్కడ ఏ సమస్య ఉన్నా దానికి పరిష్కరించేందుకు నవీన్ యాదవ్ కృషి చేస్తారని నర్సిరెడ్డి అన్నారు.