ఇబ్రహీంపట్నం: రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్‌ను 42 % కలిపి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తేనే బీసీ ప్రజలకు న్యాయం జరుగుతుందని ఇబ్రహీంపట్నం మండల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉధృతం కావొచ్చని వారు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో బీసీ రిజర్వేషన్ అంశంపై నిరాశ వ్యక్తమైందని తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్‌పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు.