సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు సన్నాహాలు
NEWS Oct 23,2025 10:10 pm
కామారెడ్డిలో సైన్స్ మ్యూజియం స్థాపనకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో పాత ఇంజినీరింగ్ కళాశాల భవనంలో ఈ మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఇంజినీరింగ్ కళాశాలను సందర్శించి, మ్యూజియం ఏర్పాట్లను పర్యవేక్షించారు. సంబంధిత అధికారులతో చర్చించి అవసరమైన సూచనలు ఇచ్చారు.