తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
NEWS Oct 23,2025 07:21 pm
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్న నిబంధనను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది. ఈ మేరకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 21(3) ని సవరించేందుకు కేబినెట్ నిర్ణయించింది. ఈ ఫైల్‌పై పంచాయతీరాజ్, మంత్రి సీతక్క, సీఎం రేవంత్ ఇప్పటికే సంతకం చేశారు. ఈ చట్టం ప్రకారం 1994 తర్వాత మూడో సంతానం కలిగితే వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు.