ఆటో డ్రైవర్‌కి అండగా గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి
NEWS Oct 23,2025 07:01 pm
కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త, ఆటో డ్రైవర్ లడ్డూ కుటుంబానికి టీ-పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆర్థిక హెల్ప్ అందించారు. ఇటీవల పొందుర్తి సమీపంలో జరిగిన ఆటో ప్రమాదంలో లడ్డు గాయపడగా, ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులు చికిత్స పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ కుటుంబానికి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ₹12,000 సహాయం అందించారు. గతంలో కూడా లడ్డు తల్లి అనారోగ్యంతో ఉన్న సమయంలో ఆయన సహాయం అందించిన విషయం గుర్తుచేసుకుంటూ, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి “కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది” అని తెలిపారు. మాజీ కౌన్సిలర్ శంకర్ రావు, పండు శ్రీకాంత్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.