AP: ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. మద్యం తాగి అసెంబ్లీకి వచ్చిన వాళ్లను అసెంబ్లీలోకి ఎలా అనుమతించారని జగన్ ప్రశ్నించారు. అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి? ఆయన మాట్లాడింది ఏంటని జగన్ ఫైర్ అయ్యారు. బాలకృష్ణ తాగొచ్చి అసెంబ్లీలో ఇష్టానుసారంగా మాట్లాడారని, ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందనన్నారు. తాగిన వాళ్లను స్పీకర్ ఎలా అసెంబ్లీలోకి అనుమతించారని జగన్ నిలదీశారు.