రామ్ చరణ్ భార్య ఉపాసన రెండోసారి ప్రెగ్నెంట్ అయిన నేపథ్యంలో సీమంతం జరిగింది. దీపావళి పండుగ సందర్భంగా ఈ సీమంతం వేడుకని నిర్వహించారు. క్లోజ్ ఫ్యామిలీతోపాటు ఇండస్ట్రీ నుంచి కొద్ది మంది స్టార్స్ మాత్రమే హాజరయ్యారు. చిరుకు దగ్గరైన వాళ్లు మాత్రమే సందడి చేశారు. నాగార్జున, వెంకటేష్, నయనతార ఫ్యామిలీతో సహా పాల్గొన్నారు. నాగబాబు ఫ్యామిలీ, ఉపాసన కుటుంబం పాల్గొంది. పవన్ కళ్యాణ్ లేరు, కానీ ఆయన భార్య అన్నా లెజినోవా సందడి చేసింది.