పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న సినిమా టైటిల్ రివీలైంది. ఈ చిత్రానికి ‘ఫౌజీ’ టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో బియర్డ్ లేకుండా ప్రభాస్ పవర్‌ఫుల్ లుక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఒంటరిగా పోరాడే ఒక బెటాలియన్ అనే ట్యాగ్‌లైన్ ఇచ్చారు. అలాగే ఓ సంస్కృత శ్లోకాన్ని మేకర్స్ ట్వీట్‌లో రాసుకొచ్చారు.