పోలీసులు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
NEWS Oct 23,2025 02:08 pm
రాజమహేంద్రవరం: పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా కొవ్వూరు ప్రభుత్వం ఆస్పత్రిలో డీఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కొవ్వూరు పట్టణ, మండల పరిధిలోని అధిక సంఖ్యలో యువకులు రక్తదాన శిబిరంలో స్వచ్చందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొవ్వూరు మండల వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జి జుత్తక చరణ్ తేజ రక్తదానం చేశారు. కరోనా సమయం నుండి నేటి వరకు 8 సార్లు రక్తదానం చేసిన చరణ్ తేజను పోలీసు అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.