కార్తీక శుక్ల పాడ్యమి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి జన్మదినం ఈ ఏడాది స్వాతి నక్షత్రం అక్టోబర్ 22న వచ్చింది. నిన్న ప్రారంభమైన ఈ ఉత్సవాలు 25 వరకు శ్రీరామ నగరంలోని స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీలో 108 దివ్య క్షేత్రాల ప్రాంగణంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి 69వ తిరునక్షత్ర మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో చివరి రోజు ఈ నెల 25న స్వామి వారి ఆరాధ్యమైన రాముడికి సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తారు.