బాలిక అత్యాచార కేసు నిందితుడి సుసైడ్
NEWS Oct 23,2025 11:00 am
కాకినాడ జిల్లా తునిలో బాలిక అత్యాచారం కేసులో నిందితుడు తాటిక నారాయణరావు (62) ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం అర్ధరాత్రి కోర్టుకు తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలిక అత్యాచారం కేసులో అరెస్టయిన నారాయణరావును తుని రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకెళ్తుండగా, మధ్యలో బహిర్భూమికి వెళ్తానని చెప్పి పట్టణ శివారులోని కోమటి చెరువులో దూకినట్లు పోలీసులు తెలిపారు. గాలింపు చర్యలు చేపట్టగా, చెరువులో నిందితుడి మృతదేహం లభ్యమైంది.