జగిత్యాలలో నిరుద్యోగులకు ఉద్యోగ మేళా
NEWS Oct 23,2025 10:45 am
జగిత్యాల: జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో అక్టోబర్ 24న ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పలు ప్రైవేట్ సంస్థలు లలిత కిడ్నీ కేర్ హాస్పిటల్, వరుణ్ మోటర్స్ pvt Ltd, ఇతర ప్రైవేట్ సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సత్యమ్మ తెలిపారు. ఈ ఇంటర్వ్యూలు జగిత్యాలలోని కలెక్టర్ భవనంలో జరుగుతాయి తెలుపుతూ, డిగ్రీ అభ్యర్థులు మాత్రమే అర్హులు, నెల వేతనం రూ. 11,000 -25,000 అని అన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.