అనంతగిరి: పెదకోట పంచాయతీ పరిధిలోని మారుమూల చింతలపాలెం గ్రామానికి చెందిన సప్పి మంగలన్న (55) చూపు లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం పొందడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగలన్న మాట్లాడుతూ – “నాకు కళ్ళు కనిపించవు. ఒక కర్ర ఆధారంగా ముందర నడిచేవారి శబ్దాన్ని విని, వారి సహాయంతో రేషన్, పింఛన్, ఇతర పనుల కోసం వెళ్లాలి. ఆ మార్గంలో గుంతలు, రాళ్లు ఉంటే జారి పడిపోతాను. మా గ్రామంలో రహదారి, మంచినీళ్లు, కరెంటు వంటి ప్రాధమిక సౌకర్యాలు లేక ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు,” అని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్థులు కూడా మంగలన్న వంటి వికలాంగులకు సౌకర్యాలు కల్పించాలని, గ్రామ అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.