బొర్రా: ఉపాధి హామీ పథకం గ్రామసభ
NEWS Oct 23,2025 10:51 am
అనంతగిరి: బొర్రా సచివాలయ పరిధిలో ఉపాధి హామీ పథకం గ్రామసభను నిర్వహించారు. సర్పంచ్ జన్ని అప్పారావు ప్రధాన అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, “ఉపాధి హామీ పథకం గిరిజనులకు వెన్నుముక వంటిది. ఇది గ్రామీణ అభివృద్ధికి దోహదపడే పథకం,” అని అన్నారు. బొర్రా గ్రామ పంచాయతీ పరిధిలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 67 అభివృద్ధి పనులను గుర్తించగా, రూ. 1 కోటి 2 లక్షల 65 వేల బడ్జెట్‌కు గ్రామసభ ఆమోదం తెలిపిందని తెలిపారు. ఈ పనుల ద్వారా మొత్తం 17 గ్రామాలకు ప్రయోజనం కలుగుతుందని సర్పంచ్ అప్పారావు వివరించారు. సెక్రటరీ మోజేష్, డిజిటల్ అసిస్టెంట్ అప్పలరాజు, ఉపాధి సిబ్బంది, మేట్స్, వేతనదారులు పాల్గొన్నారు.