విద్యార్థులకు పోలీస్ విధులపై అవగాహన
NEWS Oct 23,2025 10:42 am
ఇబ్రహీంపట్నం: పోలీసు అమరవీరుల మహోత్సవాల సందర్భంలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ అశోక్ కుమార్, IPS ఆదేశాల మేరకు ఎస్ఐ అనిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మోడల్ స్కూల్ విద్యార్థులకు పోలీస్ స్టేషన్‌లో నిర్వహించే రోజువారీ విధులు, రికార్డుల నిర్వహణ, దర్యాప్తు ప్రక్రియ, పోలీసు సేవల గురించి సిబ్బంది వివరించారు. విద్యార్థులు ఆసక్తిగా పోలీసు కార్యకలాపాలను పరిశీలించారు. పోలీస్ సిబ్బంది, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.