సునీత మాగంటి భార్య కాదంటూ ఫిర్యాదు
NEWS Oct 22,2025 07:11 pm
HYD: దివంగత నాయకుడు మాగంటి గోపీనాథ్ మొదటి భార్య తనయుడు ప్రద్యుమ్న. సునీత, మాగంటి గోపీనాథ్ అసలు భార్యా భర్తలే కాదని ఆరోపించారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోలేదని, లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నారంటూ బాంబ్ పేల్చారు. ఎన్నికల కమిషన్‌కు సునీత ఇచ్చిన అఫిడవిట్‌ను రద్దు చేయాలన్నారు. ఈ మేరకు ఈసీకి వినతి పత్రం అందజేశారు ప్రద్యుమ్న. సునీత.. గోపీనాథ్ భార్య కాదన్నారు. తన తల్లి మాలినితో గోపీనాథ్‌కు విడాకులు కాలేదని ప్రద్యుమ్న చెప్పుకొచ్చారు.