గాయపడ్డ వ్యక్తికి బీఆర్ఎస్ కార్యకర్తలు ఆర్థిక సాయం
NEWS Oct 22,2025 04:59 pm
ఇబ్రహీంపట్నం: గత ఏడాది వర్షకొండలో జరిగిన ఆకస్మిక బైక్ ప్రమాదంలో సల్కం నరేష్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి ఇంటికే పరిమితమయ్యాడు. వర్షకొండకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు రూ.13,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆర్థిక సహాయం అందించిన ప్రతి ఒక్కరికీ నరేష్ కృతజ్ఞతలు తెలిపారు. దొంతుల తుక్కారం, దోమకొండ చిన్న రాజన్న, మామిడి సురేష్ రెడ్డి, సల్వాల శంకర్, దొంతుల రాకేష్, పర్రే రమేష్, బంటు భూమన్న, సల్కం చిన్న నర్సయ్య, బిఆర్ఎస్ కార్యకర్తలు, తదితరులు ఈ సహాయంలో పాల్గొన్నారు.