వర్ష కొండ లో కొమురం భీం జయంతి వేడుకలు నిర్వహించిన : నాయకపు సంఘం
NEWS Oct 22,2025 05:01 pm
ఇబ్రహీంపట్నం: వర్షకొండ గ్రామంలో నాయకపు సంఘం ఆధ్వర్యంలో కొమరం భీమ్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు తుక్కారం, వెంకట్, ప్రకాష్ మాట్లాడుతూ.. గిరిజనుల హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడి జల్ జంగల్ జమీన్ నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పించిన గొప్ప యోధుడని అన్నారు. ఆయన జయంతిని జరుపుకోవడమే కాకుండా ఆయన ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. మాజీ సర్పంచ్ శ్యామల తుక్కారం, మాజీ ఎంపీటీసీ పొనకంటి చిన్న వెంకట్, లక్ష్మణ్, సురేష్ రెడ్డి, ప్రకాష్, శేఖర్ నాయకపు సంఘం సభ్యులు ప్రవీణ్, అవినాష్, రాహుల్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.