'సిందుదేశ్' నినాదంతో పాక్‌కు తలనొప్పి
NEWS Oct 22,2025 11:27 am
పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతంలో 'సిందుదేశ్' ప్రత్యేక దేశం డిమాండ్ బలంగా వినిపిస్తోంది. 5,000 ఏళ్ల భాషా, సాంస్కృతిక గుర్తింపును పాక్ ప్రభుత్వం, పంజాబీ నాయకత్వం అణచివేస్తోందని సింధీ ప్రజలు ఆరోపిస్తున్నారు. మానవ హక్కుల ఉల్లంఘన, సహజ వనరుల దోపిడీ, ఆర్థిక వివక్ష, జనాభా మార్పుల కుట్రలే ఈ ఉద్యమానికి ప్రధాన కారణాలు. GM సయ్యద్ ప్రారంభించిన ఈ పోరాటం బలూచిస్తాన్ ఉద్యమం నుంచి ప్రేరణ పొందింది. JSFM వంటి సంస్థలు శాంతియుత నిరసనలు చేస్తుండగా, SLA వంటివి సాయుధ పోరాటానికి సిద్ధమవుతున్నాయి. పాక్ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని బలవంతంగా అణచివేస్తుండటంతో, బలూచిస్తాన్ తరహాలో సింధ్‌లో కూడా అశాంతి నెలకొనే ప్రమాదం ఉంది.