ఓపెన్ ఏఐ బ్రౌజర్ అట్లాస్ లాంచ్
NEWS Oct 22,2025 10:44 am
ప్రపంచవ్యాప్తంగా ChatGPT ద్వారా వినియోగదారులను ఆకట్టుకున్న OpenAI కృత్రిమమేధ రంగంలో మరో ముందడుగు వేసింది. ChatGPT Atlas పేరుతో బ్రౌజర్‌ను ఆవిష్కరించింది. AIతో పనిచేసేలా దీనిని రూపొందించినట్లు కంపెనీ CEO శామ్ ఆల్ట్‌మన్ వెల్లడించారు. యాపిల్ మ్యాక్ OSలో అట్లాస్ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఇది గూగుల్ బ్రౌజర్ లాగానే పని చేసినా.. సరికొత్త ఫీచర్లు, ఇంటర్‌ఫేస్‌ను కూడా ఇందులో అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. తాము రూపొందించిన బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌కు బలమైన పోటీ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.