అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ ఈవెంట్‌లో ట్రంప్.. భారతీయ సీఈఓలు, వ్యాపార నాయకులతో కలిసి పాల్గొన్నారు. చెడుపై మంచి విజయానికి గుర్తుగా, చీకటిని తొలగించే వెలుగును ఆహ్వానించేదే దీపావళి. సంతోషాల పండుగ అని ట్రంప్ అన్నారు. \"ఈ పండుగ శాంతి, సమృద్ధిని తెస్తుంది\" అని వైట్‌హౌస్ అధికారికంగా దీపావళి సందేశం విడుదల చేసింది. తాను ఈ రోజు ప్రధాని మోడీతో మాట్లాడుతూ వాణిజ్యం గురించి చర్చించాన్నారు.