జూబ్లీహిల్స్: ప్రధాన నేతల ప్రచారం
NEWS Oct 22,2025 10:01 am
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో ఆయా పార్టీల స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో సీఎం రేవంత్, గులాబీ బాస్ కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. ఈ నేతల ప్రచారం వారి పార్టీలకు ప్లస్‌గా మారే అవకాశముంది. అయితే ఇది ఓటర్లను ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది చూడాలి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఖచ్చితంగా గెలవాలన్న కసితో ఉండగా, సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని BRS చూస్తోంది. అటు BJP సంచలనం నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతోంది.