తులం బంగారం ₹40 లక్షలు ఎప్పుడంటే..
NEWS Oct 21,2025 11:36 pm
2000లో బంగారం 10 గ్రాముల ధర ₹4,400. 2025 (అక్టోబర్)లో 10 గ్రా. బంగారం ధర ₹ 1.32 లక్షలు దాటింది. ప్రస్తుతం ₹ 1.32లక్షలు ఉన్న బంగారం.. 2050 నాటికి ₹ 40 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని అంచనా. గోల్డ్ ధర 10 గ్రాములకు ₹ 40 లక్షలకు చేరుకుంటే.. అప్పుడు కేవలం 25 గ్రాముల గోల్డ్ కొనడానికి ₹ 1 కోటి అవుతుంది. వడ్డీ రేట్లు, డాలర్ రేటు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థితి, కేంద్ర బ్యాంకుల విధానాల వంటి అనేక అంశాలను బట్టి 2050లో ధరలు ఈ అంచనా అటుఇటు ఉండవచ్చు.