దీపావళికి ₹6.05 లక్షల కోట్ల వ్యాపారం
NEWS Oct 21,2025 11:20 pm
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి సౌండ్ దద్దరిల్లిపోయింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ₹6.05 లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(CAIT) వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే 25% (₹4.25 లక్షల కోట్లు) సేల్స్ పెరిగినట్లు CAIT సెక్రటరీ ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు. 87% మంది స్వదేశీ ఉత్పత్తులనే ఇష్టపడుతున్నారని, దీంతో చైనా ప్రొడక్టులకు డిమాండ్ తగ్గిందని తెలిపారు.