సామాజిక ఉద్యమకారుల సమైక్య జేఏసీ
NEWS Oct 21,2025 01:28 pm
నిజామాబాద్: ప్రజల సమస్యలు, సామాజిక న్యాయం, ప్రజా హక్కుల సాధన లక్ష్యంగా సామాజిక ఉద్యమకారుల సమైక్య JAC అన్ని ప్రజా సంఘాల సమన్వయంతో ఏర్పాటైంది. ఈ వేదిక ద్వారా సమానత్వం, పారదర్శకత, బాధ్యతాయుత పాలన కోసం కృషి చేయనున్నట్లు JAC నాయకులు తెలిపారు. తీగల అశోక్ కుమార్ పిలుపు మేరకు పోతగల్ల శ్రీనివాస్, ఎర్ర రామచంద్రం, దాసారం కృష్ణ, నాగమణి, శ్రీనివాస్, మల్లేష్ పాల్గొన్నారు. “ప్రజల స్వరమే మా బలం, సామాజిక మార్పే మా లక్ష్యం” అని పోతగల్ల శ్రీనివాస్ అన్నారు.