డేంజర్ జోన్‌లోకి ఢిల్లీ ‘గాలి’!
NEWS Oct 21,2025 02:56 pm
దీపావళి తర్వాత ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఇవాళ ఉదయం చాణక్య ప్లేస్‌లో AQI 979గా, నారాయణ విలేజ్‌లో 940గా నమోదైంది. దీంతో ఆరోగ్యంగా ఉన్నవారు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఎమర్జెన్సీ అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని, బయటకొస్తే N95, N99 మాస్కులను తప్పనిసరిగా ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.