దీపావళి సందర్భంగా భారతీయులను ఉద్దేశిస్తూ.. ప్రధాని మోదీ ఓ లేఖ రాశారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు.. ఆపరేషన్ సిందూర్‌కు శ్రీరాముడే స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ భారత ధర్మాన్ని కాపాడటంతో పాటు.. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుందన్నారు. ‘అయోధ్యలో రామాలయం నిర్మించిన తర్వాత ఇది రెండో దీపావళి. ధర్మాన్ని కాపాడాలని శ్రీరాముడు మనకు బోధించాడు. అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు. కొన్ని నెలల క్రితం మనం చేపట్టిన ఆపరేషన్ సిందూరే దీనికి ఉదాహరణ. మనం భారత ధర్మాన్ని కాపాడటంతో పాటు ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం.