సన్యాసం తీసుకునే అవకాశం: రేణూ
NEWS Oct 21,2025 12:57 pm
రేణూ దేశాయ్ దాదాపు 20 ఏళ్ల తర్వాత రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’లో కనిపించింది. ఆ సినిమా టైంలో తనపై కొన్ని విమర్శలు వచ్చాయని, ఆ ట్రోల్ చేసినవారు ఎవరూ తర్వాత తనకు సారీ చెప్పలేదన్నారు. 15 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీకి వచ్చానని, అప్పటినుంచి ఇప్పటి వరకూ సినిమాలు చేస్తూ ఉన్నట్లైతే ఇప్పటికి చాలా మంచి పేరు వచ్చేది. మహిళా ప్రాధాన్యం ఉన్న ఛాన్స్‌లు వస్తున్నాయని, ప్రస్తుతం అత్తగారి పాత్రకు ఓకే చేసినట్లు చెప్పారు. తనకు ఆధ్యాత్మిక మార్గం అంటే ఇష్టమని.. భవిష్యత్తులో సన్యాసం తీసుకునే అవకాశం ఉందని రేణూ దేశాయ్ చెప్పారు.